ఈ నెల 30న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ రైతు దీక్ష

by Y. Venkata Narasimha Reddy |
ఈ నెల 30న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ రైతు దీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలంటూ ఈ నెల 30న ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ రుణమాఫీ అమలు సాధన దీక్ష చేపట్టనుంది. బీజేపీ శాసన సభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎన్వీ సుభాష్, పార్టీ శ్రేణులతో కలిసి ఇందిరా పార్క్ వద్ద చేయనున్న దీక్షా స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు రుణమాఫీపై సీఎం, మంత్రులు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పూర్తిస్థాయిలో జరిగిందంటే, మంత్రులు ఇంకా మాఫీ ప్రక్రియ పూర్తి కాలేదంటున్నారని వారు గుర్తు చేశారు. రైతు రుణమాఫీ కోసం గ్రామాల్లో రైతుల నుంచి ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని, పూర్తి స్థాయి రుణమాఫీ చేసి, రైతులకు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న డిమాండ్ తో 24గంటలు రైతు దీక్షకు బీజేపీ సిద్దమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో రైతు డిక్లరేషనన్ హామీ మేరకు రైతు భరోసా, వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని, కౌలు రైతులను ఆదుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని వారు తెలిపారు.

Advertisement

Next Story