రేపు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం

by Javid Pasha |   ( Updated:2023-03-05 16:02:37.0  )
రేపు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం జరగనుంది. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. కాగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ హాజరుకానున్నారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఈ మీటింగ్ కి రాష్ట్ర పదాధికారులు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు.

Advertisement

Next Story