అలా చేస్తే ఇద్దరి బండారం బయటపడుతుంది.. రేవంత్, కేటీఆర్‌పై MP అర్వింద్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
అలా చేస్తే ఇద్దరి బండారం బయటపడుతుంది.. రేవంత్, కేటీఆర్‌పై MP అర్వింద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్‌పై బీజేపీ(Telangana BJP) ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. రేవంత్ అండ్ కేటీఆర్(KTR) ఇద్దరికీ లై-డిటెక్టర్ టెస్ట్(Lie-Detector Test) చేయాలని డిమాండ్ చేశారు. నోట్ల కట్టలు తీసుకెళ్లమని రేవంత్ రెడ్డికి, ఫెమా నిబంధనలు ఉల్లంఘించి లావాదేవీలు చేయాలని కేటీఆర్‌కు ఎవరు చెప్పారో కూడా తెలియాలని అభిప్రాయపడ్డారు. లై-డిటెక్టర్ టెస్ట్ చేస్తే ఇద్దరి బండారం బయటపడుతుందని అన్నారు. తెలంగాణలో హామీలు, మోసాలపై ప్రజలకు తాము వివరిస్తామని అన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ భారీ అవినీతికి పాల్పడ్డారు. తెలంగాణ నేతలను ఢిల్లీకి తీసుకొచ్చి మరీ అక్రమాలు చేశారని అన్నారు. కాగా, గురువారం ఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఈడీ విచారణకు కేటీఆర్‌ హాజరయ్యారు.

విచారణ అనంతరం మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ అడిగిన ప్రశ్నలనే ఈడీ అధికారులు అడిగారన్నారు. రేవంత్ రెడ్డి రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ(ACB), ఈడీ(ED) అడిగిందని ఆరోపించారు. రేవంత్‌పై ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి అవే దర్యాప్తు సంస్థలతో తనపై కేసులు పెట్టే పనిలో పడ్డాడని విమర్శించారు. రేవంత్ రెడ్డిపై ఉన్న కేసులపై తన మీద నమోదైన కేసులపై లై డిటెక్టర్ టెస్టు చేస్తే నిగ్గుతేలుతుందన్నారు. న్యాయమూర్తి ముందు లైడిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమన్నారు. సీఎం రేవంత్ సిద్ధమా అని సవాల్ విసిరారు కేటీఆర్. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై ధర్మపురి అర్వింద్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed