శోభాయాత్రలో పాటతో ఉర్రూతలూగించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. వీడియో వైరల్

by Prasad Jukanti |
శోభాయాత్రలో పాటతో ఉర్రూతలూగించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో:

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగర్ అవతారమెత్తారు. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఆయన తన గళంతో అందరిని అలరించారు. శ్రీరామ నవమి పురస్కరించుకుని ఇటీవల ఆయన స్వయంగా రాసి పాడిన పాట ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను శోభాయత్రలో విడుదల చేస్తానని ఇదివరకే ప్రకటించారు. అన్నమాట ప్రకారం ఇవాళ జరిగిన శోభాయాత్రలో పూర్తి పాటను విడుదల చేయడంతో పాటు రాముడి పాటలను పాడి వినిపించారు. రాజాసింగ్ పాటకు యాత్రలో పాల్గొన్న వారంతా రాజాసింగ్ సింగింగ్ కు ఊర్రూతలూగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Next Story