- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ సర్కార్ నిర్ణయంపై BJP MLA రఘునందన్ రావు హర్షం
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్‌పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మోడీని తిట్టాల్సినవన్నీ తిట్టి, ఇలా దేశమంతా తిడుతోందని, తనకు సంస్కారం ఉంది కాబట్టి తాను తిట్టట్లేదని వ్యాఖ్యానించడంపై విరుచుకుపడ్డారు. మోడీ వయసెంత? నీ వయసెంత కేటీఆర్? ప్రధాని పదవికైనా మర్యాద ఇవ్వాలి కదా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీ, బీజేపీని డిఫెండింగ్ చేయడమే పనిగా బీఆర్ఎస్ నేతలు పెట్టుకున్నారని ఫైరయ్యారు.
ప్రధాని మోడీ ఎక్కడ బ్రోకరిజం చేశాడో మంత్రి కేటీఆర్ నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది లేదు, రాజు అయ్యేది లేదు.. యువరాజు అయ్యేది కూడా ఉండబోదని జోస్యం చెప్పారు. ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెట్టడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. కానీ తొమ్మిదేండ్లుగా శ్రీకాంతాచారి ఎందుకు గుర్తుకురాలేదని, ఇప్పుడు ఎన్నికల సమయానికి గుర్తుకువచ్చాడా? అని విమర్శలు చేశారు.
Also Read...
నీ వాట్సాప్ నెంబర్ చెప్పు కేటీఆర్.. తప్పులు నిరూపిస్తా: రఘునందన్ రావు