- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
B - ట్యాక్స్ పేరుతో రాష్ట్ర మంత్రి వసూళ్లు.. మరోసారి MLA ఏలేటి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. R ట్యాక్స్ తరహాలో కొత్తగా B ట్యాక్స్ వచ్చిందని అన్నారు. B ట్యాక్స్ పేరుతో ఓ మంత్రి విస్తృతంగా వసూళ్లకు పాల్పడుతున్నారని కీలక ఆరోపణలు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా కాంట్రాక్టర్ల నుంచి 9% శాతం B ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వంలో ఎన్ని రోజులు ఉంటామో తెలీదన్నట్లు.. ఉన్నప్పుడే దండుకోవాలనే భావనతో దోచుకుంటున్నారని అన్నారు.
కాగా, ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డికి టచ్‌లో ఉండటం కాదని.. ఆయన సొంత తమ్ముడు రాజగోపాల్ రెడ్డే ఆయనతో టచ్‌లో లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. భువనగిరి ఎంపీ టికెట్ రాజగోపాల్ రెడ్డి సతీమణికి ఇస్తామని అధిష్ఠానం చెబితే.. వెంకట్ రెడ్డి అడ్డుపడ్డారని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.