'బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే సత్తా ఏ పార్టీకి లేదు'

by GSrikanth |
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే సత్తా ఏ పార్టీకి లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే సత్తా ఏ రాజకీయ పార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్‌ అన్నారు. వామపక్షాలు, కాంగ్రెస్‌తో ముందస్తు ఎన్నికల పొత్తు పెట్టుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుదని మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరుకు రాజకీయ పార్టీలు ఒకదానికొకటి దగ్గరవడానికి పోటీ పడుతున్నాయన్నారు. జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలపారు. దేశ సంస్కృతిని, సరిహద్దులను కాపాడే శక్తి మోడీకి ఉందన్న విశ్వాసం ప్రజలకు ఉందని సుభాష్ పేర్కొన్నారు.

Advertisement

Next Story