- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'మీ నాన్న లాంటి వాళ్ల వల్లే దేశాభివృద్ధి కుంటుపడుతోంది'
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా చురకలంటించారు. జీవితంలో ఎన్నడూ పని చేయనవసరం లేని రాజవంశీయులు, ఎల్లప్పుడూ లక్ష్యాలను, ఆశయాలను, శ్రమను వెక్కిరిస్తుంటారు విమర్శించారు. భారతదేశం చైనా కంటే వెనుకబడి ఉంటే, అది ఆమె తండ్రి, అలాంటి ఇతర రాజవంశాల వారు చేసిన దశాబ్దాల రాజకీయాల కారణంగానే అని ఎద్దేవా చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలో, ఆయన కృషితో భారతదేశం నేడు తన ఆశయాలను సాధించే దిశగా క్రమంగా పుంజుకుంటోంది రాజీవ్ అన్నారు. కాగా, చైనాతోనే భారత్ పోటీ ఉందని, చైనా ఆర్థిక వ్యవస్థ 18 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉందని పదే పదే చెప్పే నిర్మలా సీతారామన్...మన లక్ష్యం 5 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఎందుకు, మనకు అధిక శ్రామిక జనాభా, వనరులు చాలా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉన్నత లక్ష్యాన్ని సాధించడం లేదు అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
Dynasts who nvr had to work their way up in life, always mock goals, ambitions n hard work
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) February 16, 2023
If India lags behind China tdy, it is bcoz decades of politics by likes of her father n other dynasts.
India is steadily growing its ambitions tdy,bcoz of PM @narendramodi #NewIndia https://t.co/mK8itRJGBu