Bird Flu: ‘బర్డ్​ఫ్లూ’పై సర్కార్ అలర్ట్.. బార్డర్లలో చెక్‌పోస్టుల ఏర్పాటు​

by Shiva |
Bird Flu: ‘బర్డ్​ఫ్లూ’పై సర్కార్ అలర్ట్.. బార్డర్లలో చెక్‌పోస్టుల ఏర్పాటు​
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పశుసంవర్థక శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ సేకరించి టెస్టింగ్ కోసం​ల్యాబ్స్‌కు పంపించారు. బర్డ్​ఫ్లూ లక్షణాలున్న సరిహద్దు రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కోళ్లు తరలించకుండా రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద 20కి పైగా చెక్​పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. మరో వైపు పశు వైద్యాధికారులు సైతం కోళ్లు చనిపోయిన ప్రాంతాల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు.

బర్డ్ ఫ్లూను అధికారికంగా గుర్తించ లేదు: అధికారులు

రాష్ట్రంలో ఇప్పటి వరకు బర్డ్‌ఫ్లూను అధికారికంగా గుర్తించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఒక్క సారిగా ఎండ వేడి పెరగడంతోనే కోళ్లు చనిపోతున్నాయని తాము అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. బర్డ్​ఫ్లూ అయితే ఒకే సారి వేల సంఖ్యలో కోళ్లు చనిపోతాయని, ఇప్పటి వరకు అలాంటి అధికారిక సమాచారం తమకు అందలేదన్నారు. మరో రెండు రోజుల పాటు పరిస్థితులు, కోళ్ల మరణాలను అంచనా వేసి శుక్రవారం కల్లా పడక్బందీ చర్యలు తీసుకుంటామన్నారు.



Next Story

Most Viewed