Bird Flu: నల్గొండ జిల్లాలో బర్ద్ ఫ్లూ కలకలం.. ఏకంగా 7 వేల కోళ్లు మృతి

by Shiva |   ( Updated:2025-02-22 07:09:29.0  )
Bird Flu: నల్గొండ జిల్లాలో బర్ద్ ఫ్లూ కలకలం.. ఏకంగా 7 వేల కోళ్లు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: బర్డ్ ఫ్లూ (Bird Flu) తెలుగు రాష్ట్రాల ప్రజలను భయపెడుతోంది. నిత్యం కలకలలాడే చికెన్ షాపులు నేడే వెలవెలబోతున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా జనం చికెన్ తినేందుకు జంకుతున్నారు. ఊహించిన పరిణామంతో చికెన్ సెంటర్ల నిర్వహాకులు, పౌల్ట్రీ రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా (Nalgonda District)లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. కేతేపల్లి (Kethepally) మండల పరిధిలోని చెరుకుపల్లి (Cherukupally) గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న కోళ్ల ఫాంలో ఏకంగా 7 వేల కోళ్లు మృతి చెందాయి. అయితే, చేసేదేమి లేక సదరు రైతు మరణించిన కోళ్లను జేసీబీ (JCB) సాయంతో పెద్ద గోయ్యి తవ్వి అందులో పూడ్చి పెట్టాడు. మొత్తం కోళ్ల ఫాంలో 13 వేల కోళ్లకు వేయగా అందులో 7 వేల కోళ్లు మృతి చెందినట్లుగా బాధిత రైతుల ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు రూ.4 లక్షలకు పైగానే నష్టం వాటిల్లిందని.. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని పౌల్ట్రీ యజమాని వేడుకుంటున్నాడు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండడంతో తెలంగాణ సర్కారు (Telangana Government) అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food Safety Officials) వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. నాణ్యతగా లేని చికెన్ విక్రయిస్తున్న వ్యాపారులపై కొరడాను ఝుళిపిస్తోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా వ్యాపారుల ధోరణి మారకపోవడంతో అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. కుళ్లిన చికెన్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story

Most Viewed