BRS పార్టీ‌కి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే

by Sathputhe Rajesh |
BRS పార్టీ‌కి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే
X

దిశ, చేవెళ్ల : బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు వరుస షాక్‌లు కలవరపెడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణరెడ్డి ఇప్పటికే పార్టీని విడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

అదే తరహాలో ఇప్పుడు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశించిన సునీత మహేందర్ రెడ్డికి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలలో ఫలితం సానుకూలంగా రాలేదని తెలిసింది. దీంతో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి వైపు కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. సర్వేలలో రంజిత్ రెడ్డికి అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చాయి. దీంతో అయనకు కాంగ్రెస్ టికెట్ దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తుంది. టికెట్ కన్ఫామ్ కాగానే నేడో రేపో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొనున్నట్లు సమాచారం.

సొంత గూటికి యాదయ్య

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా ఎంపీ రంజిత్ రెడ్డి వెంట బీఆర్ఎస్‌ను విడి కాంగ్రెస్ పార్టీలో చేరానున్నారు. 2014ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లోకి యాదయ్య వెళ్ళారు. మళ్ళీ 2018లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఇప్పుడు 2023ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ సొంతగూటికి చేరుతారని నియోజకవర్గం వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. యాదయ్య ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.

రంజిత్ రెడ్డికే చేవెళ్ల ఎంపీ టికెట్

చేవెళ్ల ఎంపీ టికెట్‌పై ఇప్పటికే చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి టికెట్ ఆశించిన సునీత మహేందర్ రెడ్డికి వ్యతిరేకంగా రిపోర్ట్ వచ్చింది. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సానుకూలంగా రిపోర్ట్ ఉంది. దీంతో అధిష్టానం రంజిత్ రెడ్డి‌కే టికెట్ దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం.

Advertisement

Next Story