- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బిగ్ బ్రేకింగ్ : టెన్త్ లీకేజీ కేసులో ఈటలకు నోటీసులు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన టెన్త్ పరీక్షా పత్రం లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే బీజేసీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ 14 రోజుల రిమాండ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్టేట్ మెంట్‌ను వరంగల్ పోలీసులు రికార్డు చేయనున్నారు.
ఎమ్మెల్యే ఈటలకు ప్రశాంత పేపర్ పంపడంతో ఈ విషయంలో పోలీసులు మరింత ఫోకస్ పెట్టారు. కమలాపూర్‌లో పేపర్ లీక్‌పై కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అప్ చేశారు. పేపర్ లీక్ కు హుజురాబాద్ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు ఈటల రాజేందర్, ఆయన పీఏకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా నేడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ విచారణపై ఉత్కంఠ నెలకొంది.
Read more:
లీక్ కుట్ర కేసుతో బీఆర్ఎస్‌లో కొత్త టెన్షన్....తాజా అంశం ప్లస్సా.. మైనస్సా అనే గుబులు