విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇక డిగ్రీ సిలబస్‌లో మార్పులు

by Shiva |
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇక డిగ్రీ సిలబస్‌లో మార్పులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీలో సిలబస్ మార్చేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. ఉపాధికి అనుగుణంగా చేంజ్ చేయాలని డెసిషన్ తీసుకున్నది. దీని కోసం ప్రత్యేకంగా ఆయా యూనివర్శిటీలు, నిపుణులతో కమిటీలు వేసి పలు దఫాలుగా చర్చించింది. ప్రస్తుతం ఆయా కోర్సులు చేసిన స్టూడెంట్స్ తాము నేర్చుకున్న విద్యా నైపుణ్యాలను నిజ జీవితంలో అనుసరించే పరిస్థితులు ఉండటం లేదు. ఫలితంగా ఉపాధి మార్గాలను అన్వేషించడంలో విఫలమవుతూ చిన్న రీజన్స్‌కు సూసైడ్స్ చేసుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సిలబస్‌లో మార్పులు చేయాలని నిర్ణయించింది.

కోర్సులన్నింటిలో మార్పులు

బీఏ, బీకాం, బీఎస్సీ, బీజెడ్సీ, బీబీఏ, బీఏబీఎడ్‌, బీఏ బీఎల్‌‌తో పాటు ఇంజినీరింగ్, డిగ్రీలోనూ సిలబస్ మార్పు చేయనున్నారు. కాలేజీల్లో విద్యనభ్యసించిన తర్వాత పోటీ ప్రపంచంలో వారు ఉపాధి పొందగలిగేలా, స్వయం శక్తిపై జీవించేలా కోర్సులను తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతమున్న సిలబస్‌ను పూర్తిగా మార్చకుండా కేవలం ఉపాధి కల్పించే విధంగా మార్పులు చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే విద్యా నిపుణులతో పలు దఫాలుగా చర్చలు జరపడంతో పాటు కమిటీలు సైతం వేశారు. ఆ కమిటీ సూచనలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ గ్రూప్‌లో ఏ కోర్ సబ్జెక్ట్‌లో ఎంత మేర సిలబస్ మార్చాలనే దానిపై డెసిషన్ తీసుకోనున్నారు.

ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

మార్చిన సిలబస్‌ను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నారు. ఈ ఏడాది మార్చిన పాఠ్యాంశాలు సత్ఫలితాలిస్తే ఆ తర్వాత అవసరానికి అనుగుణంగా కోర్ సబ్జెక్టుల్లో పూర్తి స్థాయిలో చేంజెస్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

పరిశ్రమలతో ఎంవోయూలు

విద్యార్థుల్లో విద్యతో పాటు వృత్తి నైపుణ్యాల పెంపునకు ఇంటర్న్‌షిప్ ఉండేలా ఫార్మా, ఇతర పరిశ్రమలతో ఉన్నత విద్యామండలి ఎంవోయూలు కుదుర్చుకుంటున్నది. అన్ని ప్రైవేట్ కాలేజీలు సైతం ఎంవోయూలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఎంఓయూలు కుదుర్చుకున్న పరిశ్రమలు ఆయా అకడమిక్ ఇయర్ చివరిలో జాబ్ మేళాలు నిర్వహించి విద్యా్ర్థుల అర్హత, ఆసక్తికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. దీని ద్వారా చదువు పూర్తి కాగానే ఆసక్తి ఉన్న రంగాల్లో స్టూడెంట్స్ ఉపాధి పొందే వీలు ఉంటుందని ఉన్నత విద్యా మండలి భావిస్తున్నది.

Next Story

Most Viewed