Bhudan Lands: భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు

by Shiva |   ( Updated:2024-12-13 03:42:14.0  )
Bhudan Lands: భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) భూదాన్ భూముల (Bhudan Lands) కేటాయింపు వ్యవహారంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ (Nagar Kurnool) మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి (Former MLA Marri Janardhan Reddy)కి ఈడీ (Enforcement Directorate) అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా వంశీరాం బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డికి కూడా ఈడీ నోటీసులు అందజేసింది. భూదాన్ భూముల కేటాయింపులతో సూర్యతేజతో పాటు సిద్ధారెడ్డి కూడా లాభపడినట్లుగా విచారణలో వెల్లడైంది. వారందరికీ నోటీసులు జారీ చేసిన ఈడీ ఈనెల 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా, ప్రభుత్వ (Government), భూదాన్ (Bhudaan) భూములను అప్పనంగా తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌ (IAS Amoy Kumar)పై ఈడీ (Enforcement Directorate) విచారణ ఇటీవలే ముగిసింది.

భూ బదలాయింపు లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన ఈడీ, మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌ (Former IAS officer Amoy Kumar)పై కేసు నమోదుకు సిఫారసు చేస్తూ డీజీపీ జితేందర్‌ (DGP Jitender)కు నివేదికను సమర్పించింది. అదేవిధంగా అప్పట్లో మహేశ్వరం (Maheshwaram) తహసీల్దార్‌గా విధులు నిర్వర్తించిన జ్యోతి (Jyothi), ఆర్డీవో వెంకటాచారి (RDO Venkata Chary)పై కూడా కేసులు నమోదు చేయాలని రికమెండ్ చేసింది. కాగా, రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) మహేశ్వరం (Maheshwaram) మండలం నాగారం (Nagaram) గ్రామం పరిధిలోని సర్వే నెం.181లో ఉన్న 42 ఎకరాల 33 గుంటల భూములను ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టడంలో మనీ లాండరింగ్ (Money Laundering) జరిగిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ మొత్తం వ్యవహారంలో అప్పట్లో రంగారెడ్డి (Ranga Reddy), మేడ్చల్ కలెక్టర్‌గా పని చేసిన అమోయ్‌కుమార్‌ (Amoy Kumar) పాత్ర ఉన్నట్లుగా అక్కడి రైతులు లిఖితపూర్వకంగా ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story