వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రూ.2 లక్షల రుణమాఫీపై భట్టి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రూ.2 లక్షల రుణమాఫీపై భట్టి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రాబోయే రెండు దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పని చేయడం కోసం వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వివిధ కారణాలతో పార్టీకి దూరమైన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు, పాత తరం కాంగ్రెస్ నాయకులంతా తిరిగి కాంగ్రెస్ లో చేరాలని గాంధీ భవన్ నుంచి పిలుపు ఇస్తున్నట్టు చెప్పారు. సోమవారం దివంగత సీఎం వైఎస్ఆర్ 75 జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి పాల్గొని మాట్లాడారు. ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారని ఈ చేరికల పరిణామమే రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేస్తోందనడానికి నిదర్శనం అన్నారు.

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పై ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా వెనుకడుగు వేయబోమని, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇవాళ తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతున్నదంటే దానికి వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన ఓఆర్ఆర్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, ఇతర మౌళిక సదుపాయాలే కారణం అన్నారు. వైఎస్ దీర్ఘకాలిక పునాదుల వల్ల ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయన్నారు. వైఎస్ పాలన చిరస్థాయిగా నిలుస్తుందని, వైఎస్ ఆలోచన మార్గంలో తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed