- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్‌పై భట్టి కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న గృహా జ్యోతి స్కీమ్ (200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్)కు అర్హత ఉండి కూడా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇవాళ మండలిలో ఆయన మాట్లాడుతూ.. గృహా జ్యోతి స్కీమ్‌కు అర్హత కలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని వారు సమీప మండల కార్యాలయాల్లో, పట్టణాల్లో ఉన్నవారు డివిజన్ ఆఫీసుల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమమని.. అప్లై చేసుకోని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ ఏ కుటుంబం వాడుకున్నా వారికి జీరో బిల్లులు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. గృహా జ్యోతి స్కీమ్ లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయలేదని, గ్రామ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. అలా వచ్చిన దరఖాస్తులను వడబోసి అర్హత కలిగిన వారందరికీ జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.