- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM కేసీఆర్ అవినీతిలో ఈటల రాజేందర్ భాగస్వామే: భట్టి ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉపఎన్నిక సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి రూ. 25 కోట్లు తీసుకున్నాడంటూ బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయంలో కాకరేపుతున్నాయి. ఈటల ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇక, రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడూతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై బీజేపీ బురద చల్లడాన్ని ఖండిస్తున్నామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎజెండాలో భాగంగానే ఈటల ఈ ఆరోపణలు చేశారన్నారు. ఈటల రాజేందర్ చెప్పేదానికి.. చేసేదానికి పొంతన లేదని అన్నారు. సీఎం కేసీఆర్ అవినీతిలో ఈటల రాజేందర్ కూడా భాగస్వామే అని ఆరోపించారు. బీజేపీ దగ్గర కేసీఆర్ చిట్టా ఉందని.. అలాంటప్పుడు ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ ఉండకూడదని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు.