bhatti vikramarka: రూ.2 లక్షల రుణమాఫీ పై బ్యాంకర్లకు భట్టి కీలక ఆదేశాలు

by Prasad Jukanti |
bhatti vikramarka: రూ.2 లక్షల రుణమాఫీ పై బ్యాంకర్లకు భట్టి కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రుణమాఫీ ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఆలస్యం అయితే ఫలితం ఉండదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ప్రజా‌భవన్‌లో సహచర మంత్రి తుమ్మలతో కలిసి బ్యాంకర్ల సమావేశంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ కోసం బ్యాంకులకు రూ. 18 వేల కోట్లు ఇస్తే.. నేటి వరకు రైతులకు రూ.7,500 కోట్లు మాత్రమే చేరాయని అన్నారు. ఆలస్యం జరగకుండా రైతుల రుణ ఖాతాల్లో తప్పులుంటే బ్యాంకర్లు సరిచేయాలని ఆదేశించారు. రుణమాఫీ, రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయం, భారీ మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తున్నట్టు డిప్యూటీ సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నదని స్పష్టం చేశారు.

మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు..

ఇటీవలే సీఎం బృందం విదేశీ పర్యటనలో రూ. 36 వేల కోట్ల విలువైన ఎంఓయూలు కుదుర్చుకున్నదని వెల్లడించారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా బ్యాంకర్లను కోరారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రూ. లక్ష కోట్లు వడ్డీ లేని రుణాల రూపంలో ఇవ్వబోతున్నామని తెలిపారు. తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటని, ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండేలా తమ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని వెల్లడించారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు మద్దతు అందిస్తున్నామని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని వేగవంతం చేస్తామమని భట్టి ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed