- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bhatti: వారికి ఇచ్చి వీరికి ఇవ్వకపోవడం అన్యాయం.. పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం ఫైర్

దిశ, వెబ్ డెస్క్: పద్మ అవార్డులలో కేంద్రం ఫెడరల్ స్పూర్తికి బిన్నంగా వ్యవహరించిందని డిప్యూటీ సీఎం(Deputy CM) మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఆరోపించారు. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులపై(Padma Awards) స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల పంపిణీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అస్తిత్వానికి, ఆత్మగౌరానికి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, సమాజం కోసం, కలల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఐదుగురు పేర్లను తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) అధికారికంగా సిఫారసు చేసిందని, వాటిని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చెప్పారు.
ఒక్కరికి కూడా అవార్డు ఇవ్వకపోవడం శోచనీయమని, వీరిలో ఒక్కరికి కూడా అర్హత లేదా? ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజాయుద్ధ నౌక గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయదీర్ తిరుమల రావు లాంటి వారి పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిందని తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తి కి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఐదుగురిలో ఒక్కరికి కూడా అవార్డులు ఇవ్వకపోవడం అన్యాయమని మండిపడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన వారికి ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం సూచించిన వారికి ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మందకృష్ణ మాదిగ కు పద్మశ్రీ ఇవ్వడం అభినందనీయమని భట్టి అన్నారు.