అసెంబ్లీ సమావేశాలకు సమాచారంతో సిద్దంగా ఉండండి : సీఎస్​ శాంతి కుమారి

by M.Rajitha |
అసెంబ్లీ సమావేశాలకు సమాచారంతో సిద్దంగా ఉండండి :  సీఎస్​ శాంతి కుమారి
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ సమావేశాలకు పూర్తి సమాచారం అధికారులందరు సిద్దంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షిస్తూ, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచారంతో సమాధానాలు పంపాలని, అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సి.ఎస్ అధికారులకు సూచించారు. బడ్జెట్ సెషన్‌లో సరైన సమాచారం అందించేందుకు సంబంధిత కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలని, శాఖల వారీగా నోడల్ అధికారులను కూడా నియమించుకోవాలని సి.ఎస్ అన్నారు.

తదుపరి రోజుల్లో వివిధ శాఖల డిమాండ్లపై చర్చ జరగనున్నందున, వివిధ శాఖల వారీగా పూర్తి వివరాలతో అధికారులు సన్నద్ధం కావాలని సీఎస్​ పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, జయేష్ రంజన్, రవి గుప్తా, ముఖ్య కార్యదర్శులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, శైలజా రామయ్యర్‌, సంజయ్ కుమార్, దాన కిషోర్, శ్రీధర్, ఎస్.ఎ.యం. రిజ్వీ, కార్యదర్శులు యోగితా రాణా, లోకేష్‌ కుమార్‌, క్రిస్టినా జెడ్ చోంగ్తు, బుద్ధ ప్రకాష్‌ జ్యోతి, రఘునందన్‌ రావు, అనితా రామచంద్రన్, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed