BASARA IIIT: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. బాసర ట్రిపుల్‌ ఐటీ‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

by Shiva |   ( Updated:2024-05-28 03:05:48.0  )
BASARA IIIT: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. బాసర ట్రిపుల్‌ ఐటీ‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు బాసరలోని రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ అధికారులు ప్రకటన చేశారు. 2024-2025 విద్యా సంవత్సరానికి గాను IIIT ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆసక్తి గల విద్యార్థినీ విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా జూన్ 1 నుంచి తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు వెల్లడించారు. మీ సేవ లేదా యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 22 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అని ప్రకటించారు. ఆరేళ్ల ఇంటిగ్రేడెట్‌ కోర్సుల్లో అడ్మిషన్‌ పొందితే.. రెండేళ్లు ఇంటర్‌తో పాటు నాలుగేళ్లు ఇంజినీరింగ్ కోర్సు అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం బాసర IIIT అధికారిక వెబ్‌సైట్ లేదా ఈ మెయిల్ admissions@rgukt.ac.in ద్వారా సంప్రదించాలని కోరారు.



Next Story

Most Viewed