రేవంతన్న, చంద్రన్న అంటూ బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
రేవంతన్న, చంద్రన్న అంటూ బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వార్తల్లో ఉండే కాంగ్రెస్ లీడర్, ప్రముఖ నిర్మాణ బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు, సీఎం రేవంత్ రెడ్డికి ఆయన వీరాభిమాని. అయితే, తాజాగా ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ కలిసి ఉండాలని కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆకాంక్షించారు. ‘పదవులు, హోదాలు, డబ్బులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ బంధం అనేది విడదీయరానిది. నా చంద్రన్న, నా రేవంత్ అన్న రెండు రాష్ట్రాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇలానే ఉండాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ చీఫ్ చంద్రబాబు‌కు ట్యాగ్ చేశారు. మరోవైపు ఈ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. గణేష్ అన్న నువ్వు అనుకుంటే జరుగుతుంది.. నీ టైమ్ నడుస్తోందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘వీళ్లిద్దరు పార్టీలు వేరైనా కలిసి మీలాంటి బడాబాబుల పెంచి పోశించాలి, రెండు రాష్ట్రాలను ఆగం చేయాలి’ అంటూ మరో నెటిజన్ విమర్శించారు. కాగా, ఇటీవల బండ్లగణేష్ ఆస్పత్రి బెడ్ మీద ఉన్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సన్నిహితులు చెబుతున్నారు.

Advertisement

Next Story