- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆయన ఒకప్పుడు అవినీతి మంత్రి.. అక్కడి ప్రజల సొమ్ము దోచుకున్నాడు : బండి సంజయ్
దిశ, తెలంగాణ బ్యూరో: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకప్పుడు అవినీతి మంత్రి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాన్స వాడకు చెందిన పలువురు బుధవారం బీజేపీలో చేరారు. ఈ సదర్భంగా వారిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కేబినెట్ లో స్టేషనరీ కుంభకోణంలో బర్తరఫ్ అయిన వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. అవినీతి మంత్రిగా ఆయన పేరుగడించారని ఎద్దేవాచేశారు. బాన్స్ వాడలో పోచారం కుటుంబ పాలన సాగుతోందని బండి విమర్శలు గుప్పించారు.
అక్కడి ప్రజల సొమ్మును అడ్డగోలుగా పోచారం, ఆయన కొడుకులు దోచుకుంటున్నారని ఫైరయ్యారు. వచ్చే ఎన్నికల్లో బాన్స్ వాడ ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని బండి విజ్ఞప్తిచేశారు. యువత భవిష్యత్ కంటే కేసీఆర్ కు రాజకీయాలే ముఖ్యమని సీఎంపై ధ్వజమెత్తారు. పేపర్ లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదో సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియ కేసీఆర్ సర్కార్ హాయాంలో స్కాంగా మారిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉద్యమం సమయంలో మంత్రి హరీష్ రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో చెప్పాలని ప్రశ్నించారు.