అల్లు అర్జున్‌కు బండి సంజయ్ సపోర్ట్.. మరోసారి సీఎం రేవంత్‌కు కౌంటర్

by Gantepaka Srikanth |
అల్లు అర్జున్‌కు బండి సంజయ్ సపోర్ట్.. మరోసారి సీఎం రేవంత్‌కు కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా హీరోలు(Movie Heroes) వ్యాపారాలు చేసుకుంటున్నారు. డబ్బులు పెడుతున్నారు.. డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్లేమైనా సరిహద్దుల్లో జవాన్లలాగా యుద్ధాలు చేస్తున్నారా? అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. ‘సినిమా ఎప్పుడూ భావోద్వేగాల యుద్ధభూమే. దేశభక్తి, ఐక్యతను సినిమా ప్రేరేపిస్తుంది. అనేక సినిమా పాటలు దేశాన్ని కదిలించాయి. దేశ భక్తి కేవలం సరిహద్దుల్లోనే కాదు. ప్రజల్లో స్ఫూర్తి నింపడంలో కూడా ఉంది’ అని సీఎం రేవంత్‌కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అల్లు అర్జున్ విషయంలో పోలీసుల నిర్లక్ష్యం క్లియర్‌గా కనిపిస్తోంది. కావాలనే ఆయన్ను టార్టెట్ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story