Bandi Sanjay : ధాన్యం కొనుగోళ్లపై ఫైర్ అయిన బండి సంజయ్

by M.Rajitha |
Bandi Sanjay : ధాన్యం కొనుగోళ్లపై ఫైర్ అయిన బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణాలో వరిధాన్యం కొనుగోళ్లు సరిగా జరగడం లేదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఫైర్ అయ్యారు. నెలరోజులైనా రాష్ట్రంలో ఒక్క గింజ కూడా కొనలేదని రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. స్థలం లేక రైతులు వడ్లు రోడ్లపై ఎండబోస్తున్నారని.. దీంతో వెహికిల్స్ వెళ్ళే దారిలేక ఘోర ప్రమాదాలు జరుతున్నాయని.. శనివారం మనోహరాబాద్ వద్ద జరిగిన ప్రమాదం అలాంటిదేనని పేర్కొన్నారు. ఎన్నికల హామీల్లో వడ్లకు బోనస్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారని.. ఇపుడు సన్నరకాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమేనని మంత్రి మండి పడ్డారు. అన్నిరకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోళ్లు ఆలస్యం చేయడం వలన ఆకల వర్షానికి వడ్లు తడిసి పోయాయని, తడిసిన ప్రతి గింజకు మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని అన్నారు. వడ్ల కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపడతామని మంత్రి ప్రకటించారు. మంగళవారం నుండి ప్రతి మండలంలోని తహశీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా సంజయ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story