‘బజరంగ్ దళ్‌పై నిషేధం.. ఆ పార్టీ మెప్పు కోసమే!’

by Sathputhe Rajesh |
‘బజరంగ్ దళ్‌పై నిషేధం.. ఆ పార్టీ మెప్పు కోసమే!’
X

దిశ, డైనమిక్ బ్యూరో: భజరంగ్‌దళ్‌పై నిషేధం, ఆరెస్సెస్‌పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు.. ఇవన్నీ ఎంఐఎం వంటి పార్టీల అనుకూలత కోసమే అని ప్రజలు కూడా తప్పక ఆలోచన చేస్తారని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ప్రకటనను యూపీఏ భాగస్వాములుగా ఉందామనుకుంటున్న ఎన్ని రాజకీయ పార్టీలు సమర్ధిస్తాయో వారే తెలియజేయాలని తెలిపారు. భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రస్తావించడం ఎంతవరకు సమంజసమో ఆ పార్టీ విశ్లేషించుకోవడం అత్యంత ఆవశ్యకమని శుక్రవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు.

హిందువులు విశ్వసించే భావాలకు, నమ్మకాలకు వ్యతిరేక నిర్ణయాలను ప్రకటిస్తున్న కాంగ్రెస్‌ని, మెజారిటీ ప్రజలు అనుమానించవలసిన పరిస్థితిని ఆ పార్టీ స్వయంగా సృష్టించుకుంటున్నదని పేర్కొన్నారు. నిజానికి ప్రజలలో విభజన సృష్టించడమే బీజేపీ విధానమైతే.. నేడు దేశమంతా ఆత్యధికంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల రూపంలో పరిపాలన బాధ్యతలలో ఉండదన్నారు. వాస్తవాలు చెబుతున్నదని కాబట్టి వారికి అంతే అనిపిస్తున్నదని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed