రేవంత్ రెడ్డి‎పై మరోసారి రెచ్చిపోయిన బాల్క సుమన్!

by Ramesh N |
MLA Balka Suman
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ మరోసారి రెచ్చిపోయారు. ఇటీవల సీఎం కి చెప్పు చూపించడంతో ఆయనపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాల్కసుమన్‌కు పోలీసులు నోటిసులు పంపించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ ఒక క్రిమినల్ అని.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ అని రెచ్చిపోయారు.

నిన్ననే రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు నోటీసులు పంపిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నుంచి రాష్ట్రానికి మంచి జరిగే పనులు ఆశించే పరిస్థితి లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ పాలన చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ కోసం అహర్ణిషలు తపించిన నాయకుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు తిడితే ఊరుకునేది లేదని అన్నారు. నేను పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశానని కేసు పెట్టారు.. కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కూడా కేసు పెట్టాలన్నారు.

Advertisement

Next Story