- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బక్క జడ్సన్ ఆరోగ్యం విషమం.. నిరుద్యోగుల సమస్యలపై పది రోజులుగా దీక్ష
దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత, మాజీ చైర్మన్ రజినీ సాయిచంద్ ఇవాళ ఆయనకు మద్దతు తెలుపడానికి వెళ్ళారు. జడ్సన్ ఆరోగ్యం పూర్తిగా క్షిణించి పోయిందని, అంబులెన్స్ తెప్పించి నగరంలోని ఓ హాస్పిటల్ కి తరలించారు. నిరుద్యోగుల సమస్యల పై పది రోజులుగా బక్క జడ్సన్ దీక్ష చేస్తున్నారని ఆమె తెలిపారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని రజినీ మండిపడ్డారు. కాగా, ప్రస్తుతం బక్క జడ్సన్‌ను నిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
కాగా, ప్రజా సమస్యలపై పోరాటం చేసే బక్క జడ్సన్ నిరుద్యోగుల సమస్యలపై ఇటీవల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్‌కు ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని, గ్రూప్-2లో 2 వేలు, గ్రూప్-3లో 3 వేల ఉద్యోగాలు కలపాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని, గురుకులంలో డౌన్ మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని, జీవో 46 రద్దు చేయాలని, ఈ నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని తరపున జడ్సన్ నిరాహార దీక్ష చేపట్టారు.