ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎంపీడీవో మృతి.. డీజీపీకి బక్క జడ్సన్​ఫిర్యాదు

by Javid Pasha |
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎంపీడీవో మృతి.. డీజీపీకి బక్క జడ్సన్​ఫిర్యాదు
X

దిశ,తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జనగామ జిల్లాలోని ఎంపీడీవో మృతి చెందినట్లు సోమవారం డీజీపీకి బక్క జడ్సన్​ఫిర్యాదు చేశారు. బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య హత్య లో సంబంధిత దోషులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రామకృష్ణయ్య హత్య ముమ్మాటికీ ప్రభు త్వ నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యానికి నిదర్శనమేనని పేర్కొన్నారు. ఈ నెల 15న కిడ్నాప్ కు గురై హత్య జరగడం బాధాకరమన్నారు.ఈ హత్యకు పాల్పడ్డ నిందితులు గతంలో కూడా సుపారి హత్యలు చేశారని జడ్సన్​ గుర్తు చేశారు.

అయితే స్థానిక బచ్చన్నపేట ఎస్సై నవీన్ కుమార్, అప్పటి సీఐ,ఏసీపీ స్థాయిలో అధికారులు కూడా సుభద్ర హత్యను పోస్టుమార్టం రిపోర్టులో తప్పుడు నివేదికలు ఇచ్చారన్నారు. ఆ హత్య జరిగినప్పుడే నిందితులను అదుపులోకి తీసుకొని ఉంటే, తాజాగా రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య హత్య జరిగి ఉండేది కాదని జడ్సన్​ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా దళితులు, మహిళలపై బీఆర్​ఎస్​సర్కార్​లో దాడులు పెరిగాయన్నారు.

Advertisement

Next Story