- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రంగంలోకి పోలీసులు
by Satheesh |

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భజరంగ్ దళ్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో తమకు అధికారమిస్తే మతతత్వ అతివాద సంస్థలు భజరంగ్‌దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధిస్తామని హామీ ఇచ్చింది. దీంతో తెలంగాణ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ వద్ద ఆందోళనకు దిగారు. కర్ణాటక మేనిఫెస్టో ప్రతులను చించివేశారు. దీంతో భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు పోలీస్ స్టేషన్లను తరలించారు. .
Next Story