- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చర్లపల్లి జైలు నుంచి బైరి నరేష్ విడుదల
by GSrikanth |

X
దిశ, డైనమిక్ బ్యూరో: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా అరెస్టైన బైరి నరేష్‌కు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు గురువారం కొడంగల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బైరి నరేష్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు.
కాగా, దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా అరెస్టైన బైరి నరేష్ దాదాపు 45 రోజులపాటు జైల్లో ఉన్నాడు. అయ్యప్ప స్వామి పుట్టుక, చరిత్రపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హిందువులు, అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బైరి నరేష్‌ను పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించి విచారించగా నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్టు అంగీకరించారన్నారు.
Next Story