- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లంగర్‌హౌస్‌లో దారుణం.. వ్యక్తిని ముక్కలుగా నరికి గోనెసంచిలో!
by Sathputhe Rajesh |

X
దిశ, కార్వాన్ : ఓ వ్యక్తిని ముక్కలుగా చేసి గుట్టు చప్పుడు కాకుండా గోనె సంచులో వేసి ఆటోలో తీసుకొచ్చి దర్గా వద్ద పడేసిన సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. గురువారం రాత్రి 10:30 గంటలు దాటిన అనంతరం ఓ వ్యక్తితో పాటు ఓ మహిళ ఆటోలో గోనెసంచి మూటను తీసుకువచ్చి దర్గా మిలట్రీ ఆసుపత్రి సమీపంలో పడేసి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న స్థానికులు చూసి వెంటనే పరిశీలించి స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గోనెసంచిలో ముక్కలుగా ఉన్న డెడ్ బాడీని తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇద్దరు అన్నాచెల్లెళ్లను పోలీసులు అరెస్టు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
Next Story