- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణకు అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు కేటాయించాలి : ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : ‘‘కేంద్రీయ విద్యాలయాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల స్థాపన అనేది విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషిస్తున్న విప్లవాత్మక అడుగు. ఈ చొరవ విద్యార్థులను తాజా సాంకేతిక పరిజ్ఞానాలకు పరిచయం చేయడమే కాకుండా భవిష్యత్తుకు సిద్ధం చేస్తుంది. అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ద్వారా, విద్యార్థులు శాస్త్రీయ, సాంకేతిక జ్ఞానాన్ని పొందడమే కాకుండా ఆవిష్కరణ, సృజనాత్మకతలో కొత్త శిఖరాలను కూడా చేరుకుంటున్నారు.” అని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం లోక్ సభలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను తెలంగాణకు కేటాయించాలని పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించామని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు ఉచిత విద్యను అందించడానికి సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు.
ఇందుకోసం ప్రతి పాఠశాలకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలతో జత కట్టడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన అభ్యర్థించారు. అలాగే, ఆర్టికల్ 377 రూల్ పైన కూడా ఆయన ప్రసంగించారు. అంతేకాకుండా రామన్నపేట రైల్వే స్టేషన్‌లో 12733/12734-నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ అనే 6 రైళ్లకు తిరుపతి నుండి లింగంపల్లి (అప్-డౌన్) వరకు రైళ్లకు హాల్టిం ఇవ్వాలని కోరారు. 12703/12704-ఫలక్నుమా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుండి హౌరా (అప్-డౌన్), 67775/67776-కాచిగూడ, మిర్యాలగూడ (డెమో) లోకల్ కాచిగూడ నుండి మిర్యాలగూడ వరకు (స్థానిక అప్-డౌన్), 12604/12603-చెన్నై ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుండి చెన్నైకి (ఆప్డౌన్), 17230/17229-శబరి ఎక్స్‌ప్రెస్ సికిందరాబాద్ నుండి త్రివేండ్రం (అప్-డౌన్), 17625/17626-డెల్టా ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుండి రేపల్లె (ఆప్–డౌన్) వెళ్లే రైళ్లకు హాల్టింగ్ఇవ్వాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సందర్భంగా కోరారు.