- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆవిర్భావ వేళ.. ఏఎన్ఎంలు, ఆశాలకు సర్కారు గుడ్ న్యూస్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఏన్‌ఎంలకు బీపీ మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అత్యాధునిక టెక్నాలజీతో కూడి డిజిటల్ బీపీ పరికరాలను అందివ్వాలని ప్లాన్చేసింది. ఒక్కో యంత్రం ఖర్చు సుమారు రూ.10 వేల వరకు ఉంటుందని ఆఫీసర్లు తెలిపారు. దీంతో పాటు ఆశా వర్కర్కర్లకు చీరలు పంపిణీ చేయనున్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజు సంబంధిత స్థాఫ్‌కు జిల్లాల వారీగా వీటిని అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 9 వేల మంది ఏఎన్‌ఎంలు, ఉండగా, 37 వేల మందికి పైగా ఆశా వర్కర్లు ఉన్నారు. వీరందరికీ ఆవిర్భావ డే రోజు మిషన్లు, చీరలు ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా మిషన్లు, చీరలను పంపించినట్లు ఓ అధికారి తెలిపారు.
బీపీ, షుగర్ గుర్తింపు..?
బీపీ, షుగర్‌లను కంట్రోల్ చేస్తే ఇతర వ్యాధులేవీ ప్రబలకుండా ఉండేందుకు ఛాన్స్ఉన్నదని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో గతంలో లేని విధంగా ఇంటింటికీ బీపీ, షుగర్టెస్టులు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నది. దీనిలో భాగంగానే డిజిటల్ బీపీ మిషన్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం కొన్ని మిషన్లు ఉన్నప్పటికీ వాటిలో మ్యాన్వల్ మెథడ్‌లో టెస్టుల ప్రక్రియ ఉంటుంది. కానీ డిజిటల్ మిషన్లతో అతి తక్కువ కాలంలో ఎక్కువ మందికి టెస్టులు చేయొచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు.