Assembly Sessions: సభా సమరం..! నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

by Shiva |
Assembly Sessions: సభా సమరం..! నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. తోలిరోజు వాయిదా అనంతరం మధ్యాహ్నం బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నిబిల్లులు ప్రవేశపెట్టాలి? ఎన్నిరోజులు సమావేశాలు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? అనే దానిపై క్లారిటీ రానుంది. అదే విధంగా ఏడాది పాలనలో సాధించిన విజయాలతోపాటు పలు ప్రజోపయోగ బిల్లులను ఆమోదించనున్నట్లు సమాచారం. కాగా, తొలిరోజు సీఎం రేవంత్ రెడ్డి జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు (సవరణ) ఆర్డినెన్స్-2024 ను సభ ముందుంచనున్నారు. పురపాలక సంఘాల ఆర్డినెన్స్ (సవరణ)-2024, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (సవరణ) ఆర్డినెన్స్-2024 ప్రవేశపెట్టనున్నారు.

అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ వస్తువుల, సేవల పన్ను (సవరణ) ఆర్డినెన్స్-2024 బిల్లు, తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక ప్రతి-2022-23ను ప్రవేశపెట్టనున్నారు. మంత్రి కొండా సురేఖ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదిక (2021-2022), మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) ఆర్డినెన్స్-2024 టెబుల్ పై సభాపక్షంలో ఉంచనున్నట్లు అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు తెలిపారు. సమావేశాలకు అధికార, ప్రతిపక్ష సభ్యులు ఎవరికి వారిగా రెడీ అవుతున్నారు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు వ్యూహాలను రచించుకుంటున్నారు.



Next Story

Most Viewed