- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Assembly: దయచేసి మమ్మల్ని చూపించండి!.. స్పీకర్ కు హరీష్ రావు రిక్వెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: దయచేసి మమ్మల్ని కూడా చూపించండి అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరారు. తెలంగాణలో శాసనసభ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా అధికార ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. శనివారం బడ్జెట్ పై చర్చలో భాగంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడే ముందు ప్రభుత్వానికి, స్పీకర్ కు కీలక రిక్వెస్ట్ చేశారు. సభలో ప్రతిపక్ష నేతల ప్రసంగం సమయంలో టీవి స్క్రీన్ లలో తమని చూపించట్లేదని వాపోయారు. నిన్న మొన్న సభా సమయంలో అలాగే జరిగిందని అన్నారు. మొన్న పార్లమెంట్ లో రాహుల్ గాంధీ కూడా అదే చెప్పారని, ఆయన మాట్లాడుతుంటే స్క్రీన్ చూపించట్లేదని అన్నారని, రాహుల్ గాంధీ వారసులుగా చెప్పుకునే మీరు అలాంటి పని చేయవద్దని అన్నారు. దయచేసి సభలో ప్రతిపక్ష నేతలు మాట్లాడే సమయంలో స్క్రీన్ లు చూపించాలని హరీష్ రావు కోరారు.