Assembly: తెలంగాణకు మన్మోహన్ సింగ్ అడ్డు చెప్పలేదు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

by Ramesh Goud |
Assembly: తెలంగాణకు మన్మోహన్ సింగ్ అడ్డు చెప్పలేదు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana) కోసం మన్మోహన్ సింగ్ ఏ రోజు కూడా అడ్డు చెప్పలేదని కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్(Former PM Manmohan Singh) మృతికి సంతాపం(Condolences) తెలుపుతూ.. అసెంబ్లీ(Telangana Assembly) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మన్మోహన్ సింగ్ సేవలు మరిచిపోరు అని అన్నారు. అలాగే మన్మోహన్ సింగ్ తో తమకున్న అనుబంధం, ఆ అవకాశం జీవితంలో ఎవరికి రాదేమోనని చెప్పారు.

ప్రధానిగా ఉన్న కాలంలో పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపించే అవకాశం మాకు దొరకడం జీవితంలో అదృష్టంగా భావిస్తున్నామని, మన్మోహన్ సింగ్ మన మధ్య లేకపోయినా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. ఐదేళ్లపాటు తెలంగాణ కోసం మా గొంతు వినిపిస్తుంటే ఏ రోజు కూడా ఆయన అడ్డు చెప్పలేదని అన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారి అపాయింట్మెంట్ ఎప్పుడు అడిగినా కూడా ఇచ్చేవారని, మా సమస్యను ఎంత సమయం కేటాయించి చెప్పిన సావధానంగా వినేవారని గుర్తు చేసుకున్నారు. అంతేగాక ఐదు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం నా సహచర ఎంపీలందరం ఎన్ని గొడవలు చేసినా కూడా మౌనంగా వినేవారని మన్మోహన్ పై రాజగోపాల్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.


Next Story

Most Viewed