Telangana Assembly Sessions : రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

by M.Rajitha |
Telangana Assembly Sessions : రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి అసెంబ్లీ లో గవర్నర్​ జీష్ణు దేవ్​ వర్మ ప్రసంగిస్తారు. అనంతరం సమావేశాల ఎజెండా ఖరారుకు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు, ఏ అంశాలపై చర్చించనున్నారో ఖరారు చేయనున్నారు. బడ్జెట్​ సమావేశాలు ఈనెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 13న గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై గురువారం ఉభయసభల్లో వేరు వేరుగా చర్చించి ఆయనకు ధన్యవాదాలు తెలుపు తీర్మానం చేస్తారు. ఈనెల 17, 18 తేదీల్లో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్​, ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ తీర్మాణం చేయనున్నారు.

ఈనెల 19న బడ్ఝెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ నెలాఖరు వరకు సభ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్​తో పాటుగా ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్​లు 42 శాతం అమలుచేస్తూ తీర్మాణమే ప్రధానంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్​ హాజరుకానున్నారు. తాను సమావేశాలకు వస్తానని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాలు ఆసక్తికరంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా రైతులు, నిరుద్యోగుల సమస్యలు, కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటిలు ఇలా పలు ప్రధానమైన అంశాలు చర్చకు రానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్​ ప్రసాద్​కుమార్​, మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అటంకాలు కలగకుండా సమావేశాలు జరిగే విధంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.



Next Story

Most Viewed