BC Reservation Bill : బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

by M.Rajitha |   ( Updated:2025-03-17 14:37:48.0  )
BC Reservation Bill : బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు బీసీ రిజర్వేషన్ బిల్లు(BC Reservation Bill )కు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆమోద ముద్ర వేసింది. విద్యా, ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌(42% Reservations) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును సోమవారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. సభలో దీనిపై చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదముద్ర పడినట్టైంది. బిల్లు ఆమోదం అనంతరం సభ రేయపతికి వాయిదా పడింది. ఈ బిల్లును త్వరలో పార్లమెంటుకు పంపనున్నారు.

కాగా సోమవారం ఉదయం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌కు, బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా.. మనందరం వీలైనంత త్వరగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) దగ్గరకు వెళ్లి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించుకుందాం’ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐతో పాటు అన్నిరాజకీయ పార్టీలను కలుపుకొని పోతామన్నారు. ఏ వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని చెప్పారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు తాను నాయకత్వం వహిస్తానని ఈ సభా నాయకుడిగా మాటిస్తున్నానన్నారు.

Next Story

Most Viewed