TG: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పకుండా హాజరు కావాలి.. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ ఆదేశం

by Gantepaka Srikanth |
TG: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పకుండా హాజరు కావాలి.. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒరియంటేషన్ ప్రోగ్రాంకు శాసనసభ, శాసన పరిషత్ సభ్యులు విధిగా హాజరుకావాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించే ఒరియంటేషన్ ప్రోగ్రాం ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాసనసభలో అనుసరించే విధానాలు, చట్టాలపై అవగాహన, తదితర అంశాలను సభ్యులకు వివరించడం జరుగుతుందన్నారు. సభ గొప్పతనం, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనే అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. సభ్యులంతా హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో లేజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వి.నరసింహా చార్యులు, ఎంసీహెచ్ఆర్డీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్, అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed