ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం.. MLC కవిత సీరియస్ రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-30 11:50:57.0  )
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం.. MLC కవిత సీరియస్ రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరుగగా ఎమ్మెల్సీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. హత్య రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదు. రాజకీయంగా ఎదుర్కొనలేక భౌతిక దాడులకు దిగడం సరికాదు. ఎన్నికలను ఎదుర్కొనలేక ఇలాంటి సంఘ విద్రోహక చర్యలకు పాల్పడటాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సహించబోరు. తస్మాత్ జాగ్రత్త!!’ అని రాసుకొచ్చారు. ఇక, బాన్సువాడ సభలో సీఎం కేసీఆర్ సైతం దాడిని తీవ్రంగా ఖండించారు

Advertisement

Next Story