- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CAA అమలుపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: CAA చట్టం అమలుపై ఎమ్ఐఎమ్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోమవారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. దేశంలో ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని సెటైర్లు వేశారు. సీఏఏపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి దేశంలో ఆశ్రయం ఇవ్వండి అని కేంద్రానికి సూచించారు. అసలు సీఏఏ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో పెట్టారు.. ఎన్నికలు దగ్గరపడగానే ఇప్పుడెందుకు అమలు చేయడానికి సిద్ధమయ్యారో కేంద్రం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేవలం ముస్లింలే లక్ష్యంగా సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌లు తీసుకొచ్చారని అన్నారు. కాగా, ఇవాళ దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇప్పుడు దేశంలో సీఏఏ అమల్లోకి వచ్చింది. CAA అమలు తర్వాత, ఇప్పుడు 31 డిసెంబర్ 2014న లేదా అంతకు ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశంలోకి ప్రవేశించిన హిందువులు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు ఐదేళ్లపాటు ఇక్కడ నివసించిన తర్వాత భారత పౌరసత్వం పొందుతారు. ఆరు కమ్యూనిటీలకు భారత ప్రభుత్వ పౌరసత్వం లభించనుంది.
Read More : నేటి నుంచి అమల్లోకి సీఏఏ.. ఎన్నికల వేళ మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం