Bhatti Vikramarka: తెలంగాణ ఉన్నంతకాలం మన్మోహన్ పేరు చిరస్థాయిగా ఉంటుంది: భట్టి విక్రమార్క

by Prasad Jukanti |
Bhatti Vikramarka: తెలంగాణ ఉన్నంతకాలం మన్మోహన్ పేరు చిరస్థాయిగా ఉంటుంది: భట్టి విక్రమార్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: మానవతా ప్రమాణాలు నెలకొల్పిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఆయన చేపట్టిన ప్రతి పదవికీ వన్నె తెచ్చారని, సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని బలమైన శక్తిగా నిలిపారన్నారు. ఇవాళ శాసనసభలో మాట్లాడిన భట్టి విక్రమార్క.. మన్మోహన్ సింగ్ (Manmohan Singh) నిర్ణయాలు పేదలను దారిద్ర్యం నుంచి బయటపడేశాయని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం మన్మోహన్ పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింప చేశారని గుర్తు చేశారు. దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని మన్మోహన్ సింగ్ అని నేడు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ప్రధాత మన్మోహన్ సింగ్ అన్నారు. హైదరాబాదులో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు, ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు వ్యక్తం చేస్తున్నానన్నారు. ప్రతి బాధ్యతలో ఆయన కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులే కాదు సామాజిక పరిస్థితులు అర్థం చేసుకొని అనేక చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ దేనన్నారు. సామాన్యుడు సమాచారాన్ని తెలుసుకునే సమాచార హక్కు చట్టం, దేశగతినే మార్చిన ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఆయనే తీసుకువచ్చారన్నారు.

Advertisement

Next Story

Most Viewed