Ganesh immersion : గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. ఆమ్రపాలి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-14 14:29:49.0  )
Ganesh immersion : గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. ఆమ్రపాలి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 17వ తేదీన జరుగబోయే గణపతి నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఐదు పెద్ద చెరువులతో పాటు ప్రత్యేకంగా నీటి కొలనులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. 102 మినీటిప్పర్లు, జేసీబీలు, యాక్షన్ టీమ్స్ రెడీ చేసినట్లూ స్పష్టం చేశారు. కాగా, గతంలో పోలిస్తే ఈసారి గణేష్ నవరాత్రి ఉత్సవాలు నగర వ్యాప్తంగా గ్రాండ్‌గా చేశారు. ప్రతీ గల్లీలో మండపాలు ఏర్పాటు చేశారు. కొందరు రెండ్రోజుల్లో, కొందరు మూడ్రోజుల్లో, మరి కొందరు ఐదు రోజుల్లో ఇప్పటికే నిమజ్జనాలు పూర్తి చేశారు. మొత్తంగా ఈ నెల 17వ తేదీన నగరంలోని గణపతులంతా నీటమునగనున్నారు. ఈ క్రమంలోనే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు వెల్లడించారు.



Next Story

Most Viewed