- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ మంత్రిని మరింత కన్ఫ్యూజ్ చేస్తున్న కేసీఆర్ మిత్రులు?
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. టీఆర్ఎస్‌తో పొత్తులపై తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్‌కు కమ్యూనిస్టులకు మధ్య పొడిచిన పొత్తు వ్యవహారం ఏ తీరం చేరుతుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్‌తో పొత్తు శాశ్వతం కాదంటూ కూనంనేని చేసిన కామెంట్స్ ఇటు టీఆర్ఎస్‌తో పాటు సీపీఐ పార్టీలో చర్చగా మారింది. అలాగే పాలేరులో కూడా తాము గెలవడానికి ప్రయత్నిస్తామని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
గురువారం మీడియాతో మాట్లాడిన కూనంనేని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో గట్టిప్రయత్నమే చేస్తున్నట్టు ఆయన మాటలను బట్టి అర్థం అవుతోంది. కొన్ని రోజుల క్రితం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సైతం పాలేరు స్థానంలో తమ సత్తా చాటుతామని చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్టింగ్‌లు అందరికీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించడంతో పాలేరు టికెట్ విషయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలోచనలో పడ్డారనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ టీఆర్ఎస్‌లోకి రావడంతో సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తే తన పరిస్థితి ఏంటనేది తుమ్మల అంచనాలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన వరుస కార్యక్రమాలతో జోరు పెంచగా అదే పాలేరు విషయంలో కూనంనేని చేసిన కామెంట్స్ మరింత ఆసక్తిని రేపుతోంది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు విషయంలో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం అవగాహనతో ఉన్నట్టు ఆయా పార్టీ నేతల మాటలను బట్టి అర్థం అవుతోంది. పొత్తు కొనసాగితే ఈ రెండు పార్టీలకు కొన్ని సీట్లను కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో సీపీఐ, సీపీఎంలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఆయా సందర్భాల్లో తమ బలం ఉన్న స్థానాల పేర్లును కమ్మునిస్టులు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే కందాల ఉపేందర్ తో పొసగని కారణంగా ఇప్పటికే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాలేరులో ఎర్ర జెండా ఎగరవేస్తామని కమ్యూనిస్టులు పదే పదే చెప్పడంతో తుమ్మల ప్రయాణం ఎలా ఉండబోతోందనేది మరోసారి చర్చనీయాశంగా మారింది.