- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డీఈఈసెట్ ప్రవేశాలకు దరఖాస్తులు.. అప్లికేషన్‌కు చివరి తేదీ అదే!
by Satheesh |

X
దిశ, తెలంగాణ బ్యూరో: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఈ రెండేండ్ల కోర్సుకు శనివారం నుంచి అప్లికేషన్లను ప్రారంభించనుందని డీఈఈసెట్ కన్వీనర్ ఎస్ శ్రీనివాసచారి ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వ డైట్ కాలేజీతో పాటు, ప్రైవేట్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కాగా దరఖాస్తులకు మే 22వ తేదీ వరకు గడువు విధించినట్లు పేర్కొన్నారు. డీఈఈసెట్ ఎగ్జామ్‌ను జూన్ 1న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇతర వివరాల కోసం http://deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Next Story