రాజకీయ నాయకులు, సినిమా స్టార్లకు బిగ్ షాక్.. GHMC మరో సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |
రాజకీయ నాయకులు, సినిమా స్టార్లకు బిగ్ షాక్.. GHMC మరో సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లపై నిషేధం విధించింది. ఈ మేరకు శుక్రవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి నగరంలోని ఏ గోడపైనా సినిమాలకు సంబంధించినవి, రాజకీయాలకు సంబంధించినవి, మరే ఇతర అడ్వర్టేజ్‌మెంట్‌కు సంబంధించిన వాల్ పోస్టర్లు కనిపించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. గోడలపై రాతలు కూడా రాయడానికి వీళ్లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా పోస్టర్లు పెడితే జరిమానా విధించాలని అధికారులకు ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో, చెరువుల ఎఫ్‌టీఎల్‌లో, బఫర్ జోన్లలోని నిర్మాణాలను తొలగించడంలో హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారాలను అప్పగించిన విషయం తెలిసిందే. ఇందులో నిర్వాసితులుగా మారే వారికి అండగా ఉండేందుకు సైతం జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 14 మంది నిబ్బందిని నియమిస్తూ కమిషనర్ ఆమ్రపాలి మరో ఉత్తర్వు జారీ చేశారు. మరోవైపు మూసీ నదీ ప్రక్షాళనలో భాగంగా నివాసాలు కోల్పోయే వారికి పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిన సంగతీ తెలిసిందే. అర్హులైన నిర్వాసితులకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించేందుకు మరోసారి రీ-సర్వే చేశారు. యజమానుల నుంచి ఇంటి పత్రాలు, ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేశారు. అంతేకాదు.. ఆక్రమణలను గుర్తించి మార్క్‌లు వేశారు.

Advertisement

Next Story