లిక్కర్ కేసులో మరో సంచలనం.. కవితతో చాటింగ్ బయటపెట్టిన సుఖేష్ చంద్రశేఖర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-12 10:50:35.0  )
లిక్కర్ కేసులో మరో సంచలనం.. కవితతో చాటింగ్ బయటపెట్టిన సుఖేష్ చంద్రశేఖర్
X

దిశ, వెబ్‌డెస్క్: మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశాడు. అయితే ఈ సారిలో లేఖతో పాటు తన వాట్సాప్ చాట్‌ను సుఖేష్ చంద్రశేఖర్ తాజాగా బయటపెట్టడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ నేతలతో చేసిన చాటింగ్‌ను సుఖేష్ తాజాగా బయటపెట్టడం కలకలం రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన చాట్ ఇదేనంటూ సుఖేష్ కొన్ని స్క్రీన్ షాట్‌లను బయటపెట్టాడు. కవితక్క - టీఆర్ఎస్ అనే నంబర్‌తో చాట్ చేసినట్లు తెలిపాడు. ఏకే, ఎస్‌జే, ఏపీ, సిస్టర్ పేర్లతో కోడ్ భాషలో చాటింగ్ చేసినట్లు సుఖేష్ తెలిపాడు. 15కేజీల నెయ్యి డెలివరీ చేశానని కోడ్ భాషలో సుఖేష్ తెలిపాడు. ప్యాకెట్ నీకు అందజేస్తానని ఏజే చెప్పారని చాట్‌లో సుఖేష్ పేర్కొన్నాడు. 98101 54102 నెంబర్‌తో సుఖేష్ చాటింగ్ చేశాడు.అయితే మొత్తం 6 పేజీల లేఖను సుఖేష్ విడుదల చేయగా తాజా లేఖ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Read more:

దిశ చేతిలో సుఖేశ్ చంద్రశేఖర్ వాట్సాప్ స్క్రీన్ షాట్లు....రూ.15 కోట్లు ముట్టింది ఎమ్మెల్సీ కవితకేనని వెల్లడి

Advertisement

Next Story