Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిమాణం..

by Ramesh N |
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిమాణం..
X

దిశ, డైనమిక్ బ్యూరో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) కేసులో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఫోన్‌ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై స్టేను ఎత్తివేయాలని పంజాగుట్ట (Panjagutta) పోలీసులు హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావులపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్‌ చేశారన్న ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు నమోదు చేశారు. దీంతో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని వేర్వేరుగా పిటిషన్లు (Harish Rao) హరీశ్‌రావు, (Radhakishan Rao) రాధాకిషన్‌ రావు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే పీఎస్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై హైకోర్టు తాజాగా స్టే విధించింది. తదుపరి విచారణ చేపట్టేవరకు ఈ స్టే అమలులో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తుపై స్టేను ఎత్తివేయాలని ఇవాళ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక పంజాగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురికి గురువారం బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. మాజీ మంత్రి హరీశ్‌రావు పేషీలో పని చేసిన వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరుశురామ్ చంచల్‌గూడ జైలు నుంచి ఇవాళ విడుదల అయ్యారు.

Next Story

Most Viewed