- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఢిల్లీ లిక్కర్ కేసు: ఎమ్మెల్సీ కవితకు BIG షాక్.. రంగంలోకి సీబీఐ

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు ఇప్పటికే విచారణకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. అయితే, ఆమె బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ వృథానే అవుతున్నాయి. గురువారం బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్‌పై ఈడీ కీలక వాదన చేసింది.
కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపింది. కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో కవిత బయటకు వచ్చేలా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీబీఐ రంగంలోకి దిగడంతో ఎటు దారి తీస్తుందో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.